డేంజర్ బెల్స్.. ఇండియా, చైనా, పాకిస్థాన్లలో పెరిగిపోతున్న అణ్వాయుధాలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వినాశనానికి దగ్గరగా తీసుకెళ్తున్న వాటిలో అణ్వాయుధాలు కూడా ఒకటి. ఒకరిని మించి మరొకరు ఈ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే పనిలో పడ్డారు. తాజాగా ఇండియా, చైనా, పాకిస్థాన్ కూడా తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను భారీగా పెంచేసుకుంటున్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) వెల్లడించింది. ప్రస్తుతం చైనా దగ్గర 350, పాకిస్థాన్ దగ్గర 165, ఇండియా దగ్గర 156 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఈ ఏడాది జనవరి వరకూ ఉన్న లెక్కలివి. వీటి సంఖ్యను పెంచే పనిలో మూడు దేశాలు ఉన్నట్లు సిప్రి అధ్యయనం తేల్చింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 13,080 అణ్వాయుధాలు ఉండగా.. అందులో 90 శాతం అమెరికా, రష్యాల దగ్గరే ఉన్నాయి. ఇండియా, చైనా, పాకిస్థాన్, రష్యా, అమెరికాలే కాకుండా యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, నార్త్ కొరియాలు కూడా ఈ అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఈ దేశాలు కలిగి ఉన్న ముడి పదార్థాల గురించి కూడా సిప్రి అధ్యయనం వెల్లడించింది. అణ్వాయుధాల కోసం వాడే ప్రధాన ముడి పదార్థాలు యురేనియం, ప్లుటోనియం. వీటిలో ఇండియా, ఇజ్రాయెల్ ప్లుటోనియం నిల్వలను సమకూర్చుకోగా.. పాకిస్థాన్ యురోనియం నిల్వలను పెంచుకున్నదని ఈ అధ్యయనం తెలిపింది. అయితే ప్లుటోనియం ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పాక్ పెంచుకుంటోంది.
అటు చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్‌లు కూడా తమ అణ్వాయుధాల తయారీ కోసం పెద్ద మొత్తంలో యురేనియం, ప్లుటోనియం ఉత్పత్తి చేసినట్లు అధ్యయనం బయటపెట్టింది. ఇండియా, పాకిస్థాన్‌లు తమ మిస్సైల్ పరీక్షల గురించి చెప్పినా.. తమ దగ్గర ఉన్న అణ్వాయుధ వివరాలను మాత్రం చెప్పలేదని ఈ స్టడీ చెప్పింది. ప్రపంచంలోని మొత్తం 13080 అణ్వాయుధాల్లో సుమారు 2 వేల ఆయుధాలను ఉపయోగించడానికి పూర్తి సంసిద్ధంగా ఉంచినట్లు కూడా సిప్రి అధ్యయనం స్పష్టం చేసింది.
ఇక 2016 నుంచి 2020 మధ్య అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, చైనా ముందు వరుసలో నిలిచినట్లు సిప్రి వెల్లడించింది. మొత్తం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో సౌదీ అరేబియా వాటా 11 శాతం కాగా.. ఇండియా వాటా 9.5 శాతంగా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

