India-Iran | ఇరాన్‌కు ప్రారంభమైన విమాన సర్వీసులు.. భారతీయులకు కీలక సూచన జారీ చేసిన ఇండియన్ ఎంబసీ
India-Iran : అమెరికా-ఇరాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండియా నుంచి కూడా ఇరాన్‌కు విమానాలు నడుస్తున్నాయి.
India-Iran : అమెరికా-ఇరాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండియా నుంచి కూడా ఇరాన్‌కు విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు ఇరాన్ పర్యటనను రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. భూ మార్గం ద్వారాగానీ, వాయు మార్గం ద్వారాగానీ ఇరాన్ ప్రయాణించడం శ్రేయస్కరం కాదని సూచించింది.
ఇరాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అలాగే కొన్ని దేశాలకు విమాన సర్వీసులు ఇంకా నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ ప్రయాణించడం మంచిది కాదని ఇండియన్ ఎంబసీ తెలిపింది. అలాగే, ఇరాన్లో ఉన్న ఇండియన్స్ కూడా ఆ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇందుకోసం తాము సూచించిన సరిహద్దు మార్గాల ద్వారా సురక్షితంగా ఇరాన్ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సాయం అందిస్తామని ఎంబసీ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియాన్ ఎంబసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. పౌరులు తమను సంప్రదించేందుకు అవసరమైన ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలను కూడా ఎంబసీ విడుదల చేసింది.
ఇక, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ సహా యుద్ద ప్రభావిత ప్రాంతం నుంచి ఇండియాకు 12 లక్షల మంది వచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ విభాగం (ఎంఈఏ గల్ఫ్) తెలిపింది. యూఏఈ, ఇండియా మధ్య విమానాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని ఎంఈఏ గల్ఫ్ సెక్రెటరీ అసీమ్ ఆర్ మహాజన్ తెలిపారు. గురువారం ఒక్క రోజే యూఏఈ నుంచి ఇండియాలోని వివిధ ప్రదేశాలకు మొత్తం 110 విమానాలు ప్రయాణించినట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

