బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ అద్భుతమైన నటి. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్ అందరినీ కట్టిపడేస్తుంది. గురు చిత్రంలోని సూపర్‌హిట్ రెయిన్ సాంగ్ ‘బర్సో రే మేఘా’పై ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోగల టైమ్స్ స్క్వేర్‌లో కొంతమంది భారతీయ యువతులు ఈ పాటపై అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘ఎష్పత్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే టైమ్ స్వ్కేర్‌లో నలుగురు ఇండియన్ టీనేజర్లు బర్సోరే మేఘాపై డ్యాన్స్ చేశారు. గ్రేస్ మూమెంట్స్‌లో ఐశ్వరరాయ్ని మరిపించారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ ఈ వీడియోను 12.5 మిలియన్లకు పైగా వీక్షించారు. మిలియన్ మంది లైక్ చేశారు.