Watch: నవజాత శిశువును కరెన్సీ నోట్లతో కప్పిన తండ్రి.. నెటిజన్లు ఎలా స్పందించారంటే?
Viral Video | తండ్రి అయిన ఒక వ్యక్తి తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. నవజాత శిశువుపై వంద అమెరికన్ డాలర్ల నోట్ల వర్షం కురిపించాడు. ఆ పసిబాలుడ్ని ఆ కరెన్సీ నోట్లతో కప్పివేశాడు. తన రిచ్‌నెస్, స్టేటస్‌ను ఈ విధంగా చాటేందుకు ప్రయత్నించాడు.
వాషింగ్టన్: ఒక తండ్రి నవజాత శిశువుపై తన ప్రేమను వినూత్నంగా చాటాడు. అప్పుడే పుట్టిన పసిబాలుడిపై చాలా విలువైన కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. అలాగే ఆ శిశువును ఆ కరెన్సీ నోట్లతో పూర్తిగా కప్పివేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. అయితే ఆ వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు. నవజాత శిశువుకు హాని కలిగించేలా కరెన్సీ నోట్లను వెదజల్లడం వాటితో కప్పడాన్ని తప్పుపడ్డారు. సాధారణంగా దంపతులకు సంతానం కలిగినప్పుడు వారెంతో సంతోషిస్తారు. తల్లిదండ్రులైన ఆనందాన్ని కొందరు పలు విధాలుగా జరుపుకుంటారు. ఎక్కువ మంది పూజలు వంటి మతపర కార్యక్రమాలు చేస్తుంటారు. మరి కొందరు అన్నదానం, పేదలకు వితరణ వంటివి చేస్తారు.
కాగా, తండ్రి అయిన ఒక వ్యక్తి తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. నవజాత శిశువుపై వంద అమెరికన్ డాలర్ల నోట్ల వర్షం కురిపించాడు. ఆ పసిబాలుడ్ని ఆ కరెన్సీ నోట్లతో కప్పివేశాడు. తన రిచ్‌నెస్, స్టేటస్‌ను ఈ విధంగా చాటేందుకు ప్రయత్నించాడు. డైలీ లౌడ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘అప్పుడే పుట్టిన బిడ్డను ఒక వ్యక్తి వంద డాలర్ల నోట్లతో కప్పేశాడు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండ్రి అయిన ఆ వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు. నవజాత శిశువుపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించి, ఆ పసిబాబును కరెన్సీ నోట్లతో కప్పడాన్ని చాలా మంది తప్పుపడ్డారు. డబ్బులు కాదు క్రిములను ఆ పసిబాలుడిపై వెదజల్లుతున్నాడని విమర్శించారు. ఆ కరెన్సీ నోట్లు మురికిగా ఉన్నాయని, వాటిని శిశువుపై వేయడం వల్ల అనారోగ్యం వాటిల్లుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. నవజాత శిశువుపై బ్యాక్టీరియా బ్లాంకెట్ అని, బేబీకి తల్లి పాలు కావాలి కాని కరెన్సీ నోట్లు కాదని మరి కొందరు దుయ్యబట్టారు.
Man covers his new born baby with hundreds 😳 https://t.co/AFEYajIY6N
— Daily Loud (@DailyLoud) April 25, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Covers
- Currency Notes
- MAN
- Newborn
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

