బాలికలకు సంఘీభావంగా.. స్కూళ్లకు వెళ్లని ఆఫ్ఘన్ బాలురు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో బాలికలకు సంఘీభావంగా బాలురు కూడా స్కూళ్లకు వెళ్లడం లేదు. వారు కూడా ఇంటి వద్దనే ఉంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్, ఒకటి నుంచి 12వ తరగతి చదివే బాలురకు శనివారం నుంచి స్కూళ్లలో తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. బాలురకు మగ ఉపాధ్యాయులే బోధించాలని తాలిబన్ విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బాలికల చదువు, మహిళా టీచర్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ నేపథ్యంలో బాలికలకు సంఘీభావంగా కొందరు బాలురు స్కూళ్లకు వెళ్లలేదు. బాలికల కోసం స్కూళ్లను తెరిచేంత వరకు తాము కూడా స్కూళ్లకు వెళ్లబోమని వారు చెప్పినట్లు ది వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ‘మహిళలు సమాజంలో సగం. బాలికల పాఠశాలలు కూడా తెరిచే వరకు నేను పాఠశాలకు వెళ్లను’ అని 12 వ తరగతి చదువుతున్న 18 ఏండ్ల విద్యార్థి రోహుల్లా అన్నట్లు పేర్కొంది.
కాగా, అమ్మాయిలు ఉదయం, అబ్బాయిలు మధ్యాహ్నం చదువుతారని, మగ టీచర్లు అబ్బాయిలకు, మహిళా టీచర్లు అమ్మాయిలకు బోధిస్తారని ఆఫ్ఘనిస్థాన్‌లోని ఒక టీచర్ చెప్పారు. ఒకవేళ బాలికలకు కూడా స్కూళ్లు తెరిచినప్పటికీ వెళ్లేందుకు కొందరు వెనుకాడవచ్చని కాబూల్‌లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన ఒక ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.
‘అబ్బాయిల విద్య ఒక కుటుంబాన్ని ప్రభావితం చేయవచ్చు. కానీ, బాలికల విద్య సమాజంపై ప్రభావం చూపుతుంది. బాలికల విద్య ఒక తరాన్ని రూపొందిస్తుంది’ అని స్కూల్ ప్రిన్సిపాల్ మొహమ్మద్రెజా అన్నారు. బాలికలు తమ విద్యను తిరిగి ప్రారంభించడానికి, వారి చదువును పూర్తి చేయడానికి తాము చేయాల్సిందా చేస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో బాలికల విద్య, వారి భవిష్యత్ చదువుపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

