ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఒక ఉన్మాది గ్రౌండ్లో ఆడుకుంటున్న చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. అల్పిన్ పట్టణంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అన్నేసిలోని స్కేర్ ప్రాంతంలోని ఒక ఆటస్థలంలో కొందరు పిల్లలు ఆడుకుంటుండగా కత్తితో వచ్చిన ఒక ఆగంతకుడు పలువురు చిన్నారులను, పెద్దవారిని పొడిచి గాయపరిచాడు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మంత్రి జెరాల్డ్ డార్మనిన్ ట్వీట్ చేశారు. నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారికి గాయాలయ్యాయని, పెద్దవారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నిందితుడిని ఇంకా గుర్తించలేదని, ఎందుకు దాడికి పాల్పడింది కారణాలు తెలియరాలేదని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.