London | లండన్: బ్రిటన్‌లోని వేల్స్, బ్లాక్వుడ్లో ఉంటున్న మూడేళ్ల చిన్నారి వింటర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, బిస్కెట్లు ఇస్తే; బిస్కెట్లను వదిలేసి, కుర్చీని తినేస్తుంది. ఆమె తల్లి స్టేసీ అహెర్నే (25) పరాకుగా ఉంటే చాలు, వింటర్ రెచ్చిపోయి, గోడల ప్లాస్టర్‌ను, సోఫాల ఫోమ్‌ను, గాజు పెంకులను కరకరలాడిస్తూ ఆరగిస్తుంది.
పీకా అనే అత్యంత అరుదైన వ్యాధితో వింటర్ బాధపడుతుండటమే దీనికి కారణం. దీనితోపాటు ఆటిజం కూడా ఆమెను వేధిస్తున్నది. స్టేసీ కంటి మీద రెప్ప వేయకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, తన కుమార్తెను కాపాడుకుంటున్నది. ఒకరకంగా తమ కుమార్తె ఇంటినే తినేస్తున్నదని బాలిక తల్లి తెలిపారు.