15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసిన ఊబర్
ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం పది కిలోమీటర్ల లోపు ఉన్న పబ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ తిన్నాడు.
లండన్: ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం పది కిలోమీటర్ల లోపు ఉన్న పబ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ తిన్నాడు. క్యాబ్ బిల్లును ఊబర్ ఏకంగా 39,317 డాలర్లు (రూ.32.4 లక్షలు)గా చూపడంతో దిగ్ర్భాంతికి గురయ్యాడు.
డ్రాప్ లొకేషన్‌కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో చేరుకున్నా ఇంత బిల్లు ఎందుకు వచ్చిందనేది అతడికి అర్ధం కాలేదు. ఊబర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేని మాంచెస్టర్‌కు చెందిన 22 ఏండ్ల ఒలివర్ ఇలా ఎందుకు జరిగిందని కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు.
సాంకేతిక సమస్యలతో డ్రాప్ లొకేషన్ అదే పేరుతో ఆస్ట్రేలియాలో ఉన్న మరో లొకేషన్ చూపించిందని దాంతోనే చిన్న రైడ్‌కే అంత బిల్లు వచ్చిందని వారు వివరణ ఇచ్చారు. ఇక ఒలివర్ ఖాతాలో అంతడబ్బు లేకపోవడంతో ఆ భారీ బిల్లు అతడి ఖాతా నుంచి డిడక్ట్ కాలేదు. డబ్బు డిడక్ట్ కాకుండా కేవలం మెసేజ్ రావడంతో బతికిపోయానని ఒలివర్ ఊపిరిపీల్చుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

