ఇమ్రాన్ ఖాన్ యూటర్న్… ఏ దేశానికీ వ్యతిరేకం కానంటూ వ్యాఖ్యలు
తన ప్రభుత్వం కూలడానికి అమెరికాయే కారణమని పదే పదే ప్రకటించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఒక్కసారిగా మాట మార్చేశారు. అమెరికా, భారత్, యూరప్‌తో సహా.. ఏ దేశానికీ తాను వ్యతిరేకం కాదని ప్రకటించారు. కరాచీలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నేను ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. భారత్, అమెరికా, యూరప్.. ఇలా ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. నేను పూర్తి మానవతావాదిని. ఏ సమూహానికీ వ్యతిరేకిని కాను. అంటూ పేర్కొన్నారు.
అమెరికాపై ఇమ్రాన్ సంచలన ఆరోపణలు
ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ఇమ్రాన్ అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా కుట్రలు పన్నిందని ఆరోపించారు. ఓ దేశం నుంచి తనకు మెసేజ్ వచ్చిందని, పీఎం పదవి నుంచి ఇమ్రాన్‌ను తొలగించాలని, లేదంటే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విదేశీ అధికారి, పాక్ అధికారితో చెప్పారని పేర్కొన్నారు. తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కావడం వల్లే అగ్ర రాజ్యానికి కోపం వచ్చిందని అన్నారు. పాక్ స్వతంత్ర దేశమని, శక్తిమంతమైన దేశం చెప్పినట్లు నడుచుకోమని ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే.. అటు పాక్ ఆర్మీ, ఇటు అమెరికా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- imran
- Imran Khan
- Pakisthan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

