Imran Khan | 33 స్థానాల్లో పోటీ చేయనున్న ఇమ్రాన్ ఖాన్
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్కడే ఏకంగా 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్కడే ఏకంగా 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన పాకిస్థాన్ తెహ్రీక్ – ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆ పార్టీ వైస్ ఛైర్మన్ షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగే మొత్తం 33 పార్లమెంటరీ స్థానాలన్నింటి నుంచి పీటీఐ తరఫున ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే పోటీ చేయనున్నట్లు ఖురేషీ తెలిపారు. దేశంలో ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్… ఆ దిశగా ప్రభత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐ పార్టీ వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్‌లో 33 పార్లమెంటరీ స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో గతంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వారే విజయం సాధించారు. గత సంవత్సరం ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో ఓటమితో పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలంతా రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ 70 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి తొలుత 33 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంజాబ్ ప్రావిన్స్‌లో 12 స్థానాలు, సింధ్ ప్రావిన్స్‌లో 9, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 8, ఇస్లామాబాద్ లో 3 స్థానాలు, బలూచిస్థాన్ ప్రావిన్స్ లో 1 స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bypolls
- Imran Khan
- Pakistan
- PTI
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

