Imran Khan | ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు.. ప్రాణాలతో బయటపడ్డ పాక్ మాజీ ప్రధాని
Imran Khan | పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు జరిగాయి.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రమాదం తప్పింది. ఆయన గురువారం నిర్వహించిన ర్యాలీలో దుండగులు కాల్పులు జరిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లోని జాఫర్ అలీ ఖాన్ చౌక్‌లో జరిగిన ర్యాలీలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలైనా క్షేమంగా ప్రాణాలతో బయట పడ్డారని తెలుస్తున్నది. ఇమ్రాన్‌ఖాన్ కాలికి గాయమైంది. దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ఆయన కార్యదర్శి రషీద్, సింధు మాజీ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్, పీటీఐ నేత ఫైసల్ జావేద్, తదితరులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు.
గాయపడిన వారిని చికిత్స కోసం సమీప దవాఖానలకు తరలించారు. కాల్పులు జరిగిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్ ను ఘటనా స్థలంలో బుల్లెట్ ప్రూఫ్ కారులోకి తరలించినట్లు వీడియో దృశ్యాలు ధృవీకరిస్తున్నాయి. అంతకుముందు ఆయన ఓపెన్ టాప్ వాహనంలో పర్యటిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

