115 కొత్త జన్యుకణాల గుర్తింపు

న్యూయార్క్: మానవ శరీరంలోని డీఎన్ఏ జన్యుక్రమాన్ని పూర్తిగా ఆవిష్కరించడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ప్రొటీన్ల నిర్మాణానికి కారణమైన 115 జన్యుకణాలను కొత్తగా గుర్తించారు. తాజా పరిశోధనతో శరీర నిర్మాణం, వ్యాధికారక క్రిములను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్న డీఎన్ఏకు సంబంధించిన కీలక సమాచారాన్ని మరింత లోతుగా తెలుసుకోవచ్చని 30 పరిశోధక సంస్థలతో ఏర్పాటు చేసిన టెలోమీర్-టూ-టెలోమీర్ కన్సార్టోరియం శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మనిషి డీఎన్ఏకు సంబంధించి ఇప్పటివరకూ అంతుచిక్కని కొత్తవిషయాలు కూడా వెలుగులోకి రావచ్చని ఆశాభావంవ్యక్తం చేసింది. మనిషి డీఎన్ఏ జన్యుక్రమానికి సంబంధించి 2001, ఫిబ్రవరిలో తొలిసారిగా శాస్త్రవేత్తలు ఒక నివేదికను విడుదల చేశారు. 305.05 కోట్ల డీఎన్ఏ మూల జతల కోడ్లను బహిర్గతపరిచారు. అయితే, డీఎన్ఏ నిర్మాణానికి సంబంధించి 15 శాతం జన్యుక్రమాలను ఆ నివేదిక విశ్లేషించలేకపోయింది. 20 ఏండ్ల అనంతరం ఇప్పుడు శాస్త్రవేత్తలు మిగిలిన 15 శాతం జన్యుక్రమాలను గుర్తించడంతోపాటు గత వెర్షన్లోని లోటుపాట్లను పూరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- DNA
- genomes
- human body
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

