Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: మధ్యంతర ఫలితాలు వెలుబడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రుత్ సోషల్ అకౌంట్లో రియాక్ట్ అయ్యారు. బ్యాలెట్‌పై తాను లేనని, ఒకవేళ బ్యాలెట్‌పై తాను ఉండి ఉంటే, కచ్చితంగా భారీ మెజారిటీతో తాము గెలిచేవాళ్లమని ట్రంప్ అన్నారు.
న్యూయార్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. యూఎస్ కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తాజా రిపోర్టు ప్రకారం సేనేట్‌లో కీలక స్థానాలను డెమోక్రాట్లు గెలుచుకున్నారు. ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఓటర్లు షాకిచ్చినట్లు తెలుస్తోంది. మధ్యంతర ఫలితాలు వెలుబడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రుత్ సోషల్ అకౌంట్లో రియాక్ట్ అయ్యారు. బ్యాలెట్‌పై తాను లేనని, ఒకవేళ బ్యాలెట్‌పై తాను ఉండి ఉంటే, కచ్చితంగా భారీ మెజారిటీతో తాము గెలిచేవాళ్లమని ట్రంప్ అన్నారు. మధ్యంతర ఫలితాలు వెలుబడుతున్న నేపథ్యంలో ట్రంప్ పెద్దగా స్పందించలేదు.
పార్టీ ఓటమికి తానేమీ కారణం కాదన్న రీతిలో ఆయన పోస్టు పెట్టారు. పార్టీ ఓటమికి రిపబ్లికన్ అభ్యర్థులే కారణమన్న రీతిలో ఆయన రియాక్ట్ అయ్యారు. మధ్యంతర ఎన్నికల నిర్వహణ కోసం ట్రంప్ వ్యవహరించిన తీరుపై రిపబ్లికన్లు ఆగ్రహంగా ఉన్నారు. హోజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సేనేట్లోనూ రికపబ్లికన్లు పట్టు కోల్పోతున్న నేపథ్యంలో ట్రంప్ శైలిపై స్వంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. రిపబ్లికన్లకు పట్టు ఉన్న స్థానాల్లో డెమోక్రాట్లు గెలవడం పట్ల ట్రంప్ తన వ్యాఖ్యలను మార్చారు. న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ ఫలితాలకు తాను బాధ్యత వహించబోతున్నట్లు చెప్పారు. విపక్ష పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నామన్నారు.
ఫలితాల సరళి ఇలా..
జనవరి నాటికి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ డెమోక్రాట్ల ఆధీనంలోకి వెళ్తుంది..
229 స్థానాల్లో డెమోక్రాట్లు.. 161 స్థానాల్లో రిపబ్లికన్లు గెలిచే అవకాశాలు
డెమోక్రాట్ ఆడమ్ హామిల్టన్.. కన్సాస్ సేనేట్ సీటును గెలవనున్నారు
టెన్నెస్సిలోని రిపబ్లికన్ నేత బిల్ హెగర్తీ తన సేనేట్ సీటును నిలుపుకోనున్నారు, అర్కాన్సాస్లో టామ్ కాటన్ గెలుస్తారు
న్యూ మెక్సికో కొత్త ఎన్నికైన గవర్నర్‌గా దెబ్ హాలాండ్ బాధ్యతలు చేపడుతారు
అర్కాన్సాస్లో గవర్నర్‌గా మళ్లి రిపబ్లికన్ సారా హకాబీ శాండర్స్ గెలిచారు
డెమోక్రాట్లు రెండు కొత్త హౌజ్ సీట్లు గెలిచారు. పెన్సిల్వేనియాలో పేగీ కాగ్నెటి, జానెల్లి స్టెల్సన్ గెలిచారు
టెక్సాస్‌లో డెమోక్రాట్ విన్సెంట్ గోంజేలేజ్ గెలుపు
ఓహియో జిల్లాలో డెమోక్రాట్ గ్రేగ్ ల్యాండ్స్మాన్ గెలుపు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

