నేను కోవీషీల్డ్ వేసుకున్నా: యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి 76వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాలకు అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్ ఉన్నారు. అయితే ఇండియాలో తయారైన కోవీషీల్డ్ టీకా రెండు డోసులను తీసుకున్నట్లు ఆయన మీడియాతో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు దేశాలు ఈ టీకాను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బ్రిటీష్ కంపెనీ ఆస్ట్రాజెనికా రూపొందించిన టీకాను ఇండియాలోని సీరం సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్లపై వేసిన ప్రశ్న సాంకేతికమైనదని, అయితే తాను ఇండియాలో తయారైన కోవీషీల్డ్ టీకాను వేసుకున్నట్లు చెప్పారు. రెండు డోసులు వేసుకున్నానని, కోవీషీల్డ్‌ను ఎన్ని దేశాలు ఆమోదిస్తాయో తెలియదని, కానీ చాలా వరకు దేశాలు ఆ టీకాను వాడుతున్నట్లు షాహిద్ తెలిపారు. కోవిడ్ టీకాలకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి తప్పనిసరిగా ఉండాలా అని వేసిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. జనవరిలో మరోసారి యూఎన్ సభ్య దేశాలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని షాహిద్ నిర్వహించాలనుకుంటున్నారు. వివిధ దేశాల్లో టీకా పరిస్థితిపై ఆ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

