కీవ్ నుంచి పారిపోలేదు… ఆయుధాలు వీడేది లేదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్: తాను కీవ్ నుంచి పారిపోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. తాను పోరిపోయినట్లు వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఆయుధాలు వీడేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నేను ఇక్కడే ఉన్నాను. మేము ఆయుధాలను వీడం. మా దేశాన్ని కాపాడుకుంటాం. మా ఆయుధాలనే నమ్ముకున్నాం. ఆయుధాలు వీడి లొంగిపోవాలంటూ సైన్యానికి నేను చెప్పినట్లుగా నకిలీ వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మవద్దు’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.
కాగా, తాను అలసిపోయినట్లుగా కనిపిస్తున్నప్పటికీ చాలా దృఢనిశ్చయంతో ఉన్నానని జెలెన్స్కీ తెలిపారు. ‘ఇదే మా భూమి, మా దేశం, మా పిల్లలు… అన్నింటినీ మేం కాపాడుకుంటాం’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం మూడో రోజుకు చేరిన నేపథ్యంలో రష్యా దళాలు కీవ్లోకి దూసుకొస్తూ దాడులను తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాత్రి మనందరికీ కాళ రాత్రి అని జెలెన్స్కీ అన్నారు.
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

