హైపతియా.. ఇది మామూలు రాయి కాదు
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్న వస్తువును చూసి.. ఆ ఏముంది.. చిన్న రాతిముక్కే కదా అనుకొంటున్నారా? కాదుకాదు.. దీనికి కోటానుకోట్ల చరిత్ర ఉందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. 2013 ఈజిప్టులో దొరికిన బొగ్గులాంటి ఈ రాతి ముక్క పేరు హైపతియా. అసాధారణంగా కనిపించటంతో ఈ రాయిపై పరిశోధనలు
కైరో, మే 19: ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్న వస్తువును చూసి.. ఆ ఏముంది.. చిన్న రాతిముక్కే కదా అనుకొంటున్నారా? కాదుకాదు.. దీనికి కోటానుకోట్ల చరిత్ర ఉందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. 2013 ఈజిప్టులో దొరికిన బొగ్గులాంటి ఈ రాతి ముక్క పేరు హైపతియా. అసాధారణంగా కనిపించటంతో ఈ రాయిపై పరిశోధనలు మొదలుపెట్టారు. దానిని అధ్యయనం చేస్తున్న కొద్దీ ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ రాతి ముక్క భూమిపై పుట్టింది కాదని మొదట కనుగొన్నారు. అది అసలు మన సౌర కుటుంబానికి చెందినదే కాదని తాజాగా ప్రకటించారు.
సూర్యుడు, గ్రహాలు.. ఇవన్నీ ఉండే పాలపుంత పుట్టకముందు ఈ రాతిముక్క పుట్టిందట. కోట్ల ఏండ్ల క్రితం సూపర్నోవా పేలుడుతో ఈ ముక్క ఏర్పడిందని ఇకారస్ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన పత్రంలో శాస్త్రవేత్తలు తెలిపారు. నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు వంటి సకల ఖగోళ పదార్థాల పుట్టుకకు ఈ సూపర్నోవా పేలుళ్లే ఆధారం. కోట్ల కాంతి సంవత్సరాల దూరం వ్యాపించి ఉండే దట్టమైన ధూళి, వాయు మేఘాలనే సూపర్నోవా అంటారు. వీటిలో ఒత్తిడి పెరిగినప్పుడు మహా విస్ఫొటం చెందుతాయి. అలా జరిగిన ఒకానొక పేలుడు వల్లనే ఈ చిన్న రాయి ఏర్పడిందని పేర్కొన్నారు. అది విశ్వంలో ప్రయాణిస్తూ భూమి ఆవిర్భవించిన కొత్తలోనే దానిపై పడిందని సూత్రీకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

