మనం ఎవరైనా గట్టిగా అరిస్తే..’నువ్వు కుక్కవా మనిషివా?’ అని తిడుతుంటాం. కుక్కను చిన్నచూపు చూస్తుంటాం. కానీ, ఓ యూఎస్ వ్యక్తి ప్రతిరోజూ పార్కులో ఓ అరగంటసేపు కుక్కలా పరుగెడుతున్నాడు. ఇలా ఎందుకు పరిగెడుతున్నావ్? అని అడిగితే.. అదే నా ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. జిమ్ చేసేవాళ్లందరూ దీన్ని ఓసారి ట్రై చేయాలని కూడా సలహా ఇస్తున్నాడు. ఇతడు కుక్కలా పార్కులో పరుగెడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
యూఎస్‌కు చెందిన 31 ఏళ్ల నథానియల్ ప్రముఖ ఫిటెనెస్ కోచ్. గతేడాదినుంచి పార్కులో కుక్కలా చేతులు, కాళ్లపై పరుగెడుతున్నాడు. మొదట నిమిషంతో ప్రారంభించి, ప్రతిరోజూ ఒక నిమిషం పెంచుకుంటూ పోయాడు. ఇలా నెల చివర్లో అతడి డాగ్ వాక్ 30 నిమిషాలకు చేరుకుంది. అప్పటినుంచి ప్రతిరోజూ అరంగట కుక్కలాగా పరుగెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హై ఇంటెన్సిటీ వర్కవుట్ల సమయంలో తాను కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డానని, ఈ డాగ్ స్టైల్ వాక్ వల్ల బలం, సామర్థ్యం పెరిగాయని చెబుతున్నాడు. ఇది తన చేతులకు లో ఇంటెన్సిటీ వర్కౌట్ అని అంటున్నాడు.