ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారా.. ఫ్యూచర్లో ఆ సమస్య ఉండకపోవచ్చు.. అమెరికా శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు గానూ కొత్త ప్రయోగానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. జియోఇంజినీరింగ్ సాంకేతికతను వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకే వికర్షించేలా చేసి భూమిపైన ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని వీరు చెప్తున్నారు.
న్యూయార్క్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు గానూ కొత్త ప్రయోగానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. జియో ఇంజినీరింగ్ సాంకేతికతను వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకే వికర్షించేలా చేసి భూమిపైన ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని వీరు చెప్తున్నారు. దీనిని మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అని పిలుస్తారు. ఇందుకోసం ముందుగా మహాసముద్రంపై దిగువ వాతావరణంలో సముద్రపు ఉప్పు లేదా ఏరోసోల్‌లను స్ప్రే చేస్తారు.
ఇవి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చే కేంద్రకాలుగా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేఘాలు ప్రకాశవంతంగా మారడం వల్ల సూర్యరశ్మిని వికర్షించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా భూమిపై ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బేలో మొదటి ప్రయోగం చేశారు. కాగా, ఈ మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ పద్ధతిపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. వాతావరణాన్ని ప్రభావితం చేసే ఈ పద్ధతి వల్ల దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

