Indian Family | అమెరికాలో కాల్పుల ఘటన.. పిల్లలు ఎలా బయటపడ్డారంటే
Indian Family : అమెరికాలో భారత సంతతి వ్యక్తి.. తన భార్యతోసహా మరో ముగ్గురిని కాల్చి చంపిన ఘటనలో ముగ్గురు పిల్లలు మాత్రం ప్రాణాలు కాపాడుకోగలిగారు. పిల్లలే అయినా.. ఆ సమయంలో వారు వ్యవహరించిన తీరు వారిని రక్షించిందని అక్కడి పోలీసులు అంటున్నారు.
Indian Family : అమెరికాలో భారత సంతతి వ్యక్తి.. తన భార్యతోసహా మరో ముగ్గురిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మాత్రం ప్రాణాలు కాపాడుకోగలిగారు. పిల్లలే అయినా.. ఆ సమయంలో వారు వ్యవహరించిన తీరు వారిని రక్షించిందని అక్కడి పోలీసులు అంటున్నారు. అమెరికాలోని, జార్జియా నగరంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య మీనుతోపాటు మరో ముగ్గురిని ఇంట్లోనే కాల్చి చంపాడు.
అయితే, ఈ ఘటన సందర్భంగా వాగ్వాదం జరిగినప్పుడే అక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన వెంటనే వారు ఒక గదిలోకి వెళ్లి, అల్మరాలో దాక్కున్నారు. ముగ్గురిలో ఒక చిన్నారి వెంటనే ఆలోచించి.. అమెరికా ఎమర్జెన్సీ నెంబర్ అయిన 911కు కాల్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అట్లాంటా పరిధి లారెన్స్ విల్లే సిటీలోని ఘటన జరిగిన ఇంటికి నిమిషాల వ్యవధిలోనే పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నలుగురు మరణించి ఉన్నారు. వారు బుల్లెట్ గాయాలతో మరణించినట్లు గుర్తించారు. ముందుగా అందిన సమాచారం ఆధారంగా రూంలో దాక్కున్న పిల్లల్ని పోలీసులు రక్షించారు. వారిని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 02.30 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, పలు ఛార్జెస్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించిది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ విషయంలో పిల్లలకు, వారి బంధువులకు ఎలాంటి సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Atlanta
- Georgia
- Indian family
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

