అరామ్కో హెడ్‌క్వార్టర్స్‌పై హౌతీల దాడి
సౌదీ అరేబియాలో హౌతీల దాడులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ అరేబియాలోని తూర్పు నగరం ధహ్రాన్‌లో ఉన్న ఆ దేశ జాతీయ చమురు సంస్థ అరామ్కో ప్రధాన కార్యాలయంలోని ఓ పరిపాలనా భవనంపై మీద మంగళవారం హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు,క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు.
- యెమెన్‌పై దాడులు ఆపకపోతే మరింతగా విరుచుకుపడతాం
- సౌదీ అరేబియాకు వార్నింగ్
రియాద్ : సౌదీ అరేబియాలో హౌతీల దాడులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ అరేబియాలోని తూర్పు నగరం ధహ్రాన్‌లో ఉన్న ఆ దేశ జాతీయ చమురు సంస్థ అరామ్కో ప్రధాన కార్యాలయంలోని ఓ పరిపాలనా భవనంపై మీద మంగళవారం హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు,క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. బిల్డింగ్‌లోని పై మూడు అంతస్తులు దెబ్బతిన్నాయని, ఇందులో సీఈవో కార్యాలయం కూడా ఉందని చెప్పింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలను వెంటనే ఫైర్ సిబ్బంది అదుపుచేసినట్టు అధికారులు చెప్పారు. చమురు కేంద్రాలకు సిబ్బంది, పౌరులు దూరంగా ఉండాలని హౌతీలు ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడి జరిగింది.
దాడులు కొనసాగిస్తాం..
చమురు సంస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని.. అందుకే తమకు అవి దాడి చేసే లక్ష్యాలుగా ఉన్నట్టు హౌతీలు చెప్పారు. సౌదీలోని ఎయిర్‌పోర్టులు, చమురు కేంద్ర సంస్థలపై దాడులను కొనసాగిస్తామని హెచ్చరించారు. యెమెన్ మీద సౌదీ దాడులు ఆపకపోతే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని.. సాధారణ పౌరులు తాము ఎంచుకున్న లక్ష్యాలకు దూరంగా ఉండాలని హౌతీలు కోరారు.
బయటకు రాకండి..
సౌదీలో వైమానిక దాడులు జరిగే సమయంలో ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని సౌదీలోని భారత ఎంబసీ సూచించింది. ఎంబసీ అధికారులు జారీచేసే హెచ్చరికలు, సూచనలు పాటించాలని చెప్పింది. దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దని తెలిపింది. ఎలాంటి సహాయం కావాలన్నా ఎంబసీకి కాల్ చేసి చెప్పాలని కోరింది. సౌదీ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

