బార్బర్ ఫీట్‌కు నెటిజన్ల ప్రశంసలు : నిరాశ్రయుడికి ఫ్రీ హెయిర్ కట్‌తో మేకోవర్!
ఓ నిరాశ్రయుడికి ఉచితంగా హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చిన బార్బర్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
న్యూయార్క్ : ఓ నిరాశ్రయుడికి ఉచితంగా హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చిన బార్బర్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఎంపవరింగ్ కట్స్‌కు చెందిన జోషువ శాంటియాగో ఓ వీధిలో నిరాశ్రయుడిని చూసి అతడికి స్టన్నింగ్ మేకోవర్ ఇచ్చారు. శాంటియాగో అమెరికాలో వీధుల్లోనే బతుకీడ్చే వారికి ఉచితంగా క్షవరం చేస్తుంటాడు.
ఈ మేకోవర్‌కు సంబంధించిన వీడియోను ఎంపవరింగ్ కట్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ గురించి మంచిగా ఫీలయ్యేందుకు అర్హులని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. శాంటియాగో మొబైల్ సెలూన్‌లోని ఛైర్లో వ్యక్తి కూర్చుని ఉండగా అతడికి హెయిర్ కట్ చేస్తుండటం ఈ వీడియోలో కనిపించింది.
కటింగ్, షేవింగ్ పూర్తయిన అనంతరం సదరు వ్యక్తి ఏకంగా 20 ఏండ్లు చిన్నగా కనిపించాడని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ వైరల్ వీడియోలో వ్యక్తి న్యూ లుక్ పలువురిని ఆకట్టుకుంది. నిరాశ్రయుల పట్ల బార్బర్ చూపిన దయాగుణాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. హెయిర్‌కట్‌తో ఇంత డిఫరెన్స్ ఎలా సాధ్యమని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- free haircut
- Homeless Man
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

