డిస్నీ, వార్నర్, సోనీ చిత్రాలకు రష్యాలో బ్రేక్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌కు చెందిన మూడు మేటి స్టూడియోలు తమ సినిమాలను రష్యాలో రిలీజ్ చేయడం లేదు. వార్నర్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీ, సోనీ పిక్చర్స్ సంస్థలు తమ రాబోయే చిత్రాలను రష్యాలో రిలీజ్ చేయడంలేదని స్పష్టం చేశాయి. ఈ వారమే భారీ బడ్జెట్ మూవీ ద బ్యాట్‌మెన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కానున్నది. వాస్తవానికి వార్నర్, డిస్నీ, సోనీ సంస్థలు.. త్వరలో కొన్ని పెద్ద సినిమాలను రిలీజ్ చేయనున్నాయి. అంతర్జాతీయ బాక్సాఫీసు మార్కెట్‌పై ఉక్రెయిన్ వార్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ శుక్రవారమే ద బ్యాట్‌మెన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానున్నది. ఉత్తర అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు రెఢీ అయ్యింది. వాల్ట్ డిస్నీ రూపొదిస్తున్న టర్నింగ్ రెడ్ చిత్రాన్ని నిజానికి మార్చి 10వ తేదీన రష్యాలో రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కేవలం అమెరికాలోనే ఆ ఫిల్మ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేశారు. మార్బియస్ చిత్రం రిలీజ్‌ను రష్యాలో వాయిదా వేస్తున్నట్లు సోనీ సంస్థ తెలిపింది. వాస్తవానికి రష్యాలో హాలీవుడ్ చిత్రాలకు పెద్ద క్రేజీ ఉండదు. కానీ బాక్సాఫీసు మార్కెట్లో ఆ దేశం టాప్ టెన్‌లో ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

