హైదరాబాద్: ఓ ముసలి సింహంపై బర్రెల గుంపు దాడి చేసింది. గాయంతో సింహం లేవలేకున్నా.. దాన్ని ఎత్తి ఎత్తి పడేశాయి. ఈ ఘటన సౌతాఫ్రికా అడవిలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైల్డ్ ఫోటోగ్రాఫర్ డీన్ కెల్బ్రిక్ దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో అప్లోడ్ చేశాడు. డార్క్ మేన్ అవోకా పేరున్న ఆ వృద్ధ సింహం బర్రెల దాడిలో దారుణంగా గాయపడింది. దాదాపు 15 నిమిషాల తర్వాత సింహం గుంపు వచ్చే వరకు ఆ బర్రెలు తమ కొమ్ములతో సింహాన్ని లేపి ఎత్తేశాయి. అటాక్ జరిగిన మూడు రోజుల తర్వాత ఆ సింహం చనిపోయినట్లు ఫోటోగ్రాఫర్ తెలిపాడు.