Nepal | ఖాట్మండు : నేపాల్‌లో హెలికాప్టర్ అదృశ్యమైంది. హెలికాప్టర్లో పైలట్‌తో పాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బయల్దేరిన హెలికాప్టర్.. 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం 10:15 గంటలకు జరిగింది. అదృశ్యమైన హెలికాప్టర్ ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. అదృశ్యమైన చాపర్‌ను మనాంగ్ ఎయిర్ హెలికాప్టర్‌గా అధికారులు నిర్ధారించారు.