Fire Accident: స్పెయిన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు అపార్ట్మెంట్లు దగ్ధం.. వీడియో
Fire Accident: స్పెయిన్‌లోని వాలెన్సియా సిటీలో ఉన్న రెండు అపార్ట్మెంట్లలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందారు. 15 మంది అదృశ్యమయ్యారు. క్యాంపనార్ ప్రాంతంలో ఉన్న ఓ 14 అంతస్తుల భవంతిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు మంటలు వ్యాపించాయి.
వాలెన్సియా: స్పెయిన్‌లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. వాలెన్సియా సిటీలో ఉన్న రెండు అపార్ట్మెంట్లలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందారు. 15 మంది అదృశ్యమయ్యారు. క్యాంపనార్ ప్రాంతంలో ఉన్న ఓ 14 అంతస్తుల భవంతిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు మంటలు వ్యాపించాయి. బాల్కనీల్లో చిక్కుకున్న అపార్ట్మెంట్ వాసుల్ని అగ్నిమాపక సిబ్బంది రక్షిస్తోంది. బిల్డింగ్‌లో ఉన్న వస్తువుల వల్ల వేగంగా మంటలు వ్యాపించాయి.
మంటలు అంటుకున్న బిల్డింగ్‌లో 138 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో 450 మంది జీవిస్తున్నారు. ఆరుగురు అగ్నిమాపక సిబ్బందితో పాటు మొత్తం 15 మంది గాయపడ్డారు. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆచూకీలేని 15 మంది కోసం వెతుకుతున్నామని వాలెన్సియా మేయర్ మారియా జోస్ కటలా తెలిపారు.
దాదాపు 20 మంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. బలమైన గాలులు వల్ల మంటలు రెట్టింపు అవుతున్నాయి. క్రేన్ల ఆధారంగా ఫైర్‌ఫైటర్లు స్థానికుల్ని రక్షిస్తున్నారు.
Heavy fire in a residential tower in Valencia, Spain pic.twitter.com/kno59GiLRE
— S p r i n t e r (@Sprinter99800) February 23, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

