Sanitizers | న్యూయార్క్: కరోనా మహమ్మారి మొదలైన తర్వాత వైరస్ బారిన పడకుండా ఉండేందుకు హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ శానిటైజర్ల వినియోగాన్ని మాత్రం కొందరు కొనసాగిస్తున్నారు. అయితే, శానిటైజర్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు అమెరికా పరిశోధకులు. ఓహియోలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో కీలక అంశాలు వెలుగు చూశాయి.
క్వాటెర్నరీ కాంపౌండ్స్‌తో పాటు ఆర్గానోఫాస్ఫేట్ అనే రసాయనాల వల్ల మెదడులోని ఒలిగోడెండ్రోసైట్ అనే కణాలు ధ్వంసమవుతున్నాయని వీరు గుర్తించారు. క్రిమిసంహార స్ప్రేలు, వైప్‌లతో పాటు బ్యా క్టీరియా, వైరస్‌లను చంపే టూత్‌పేస్ట్, మౌత్‌వాష్‌లో క్వాటెర్నరీ కాంపౌండ్స్ ఉన్నట్టు పేర్కొన్నారు.మెదడుకు నష్టం చేస్తున్న మరో రసాయనమైన ఆర్గానోఫాస్ఫేట్లు దుస్తులు, గమ్, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో గుర్తించారు.