Greta Arrest | జర్మనీలో గ్రెటా థన్‌బెర్గ్ అరెస్ట్.. బొగ్గు గని విస్తరణకు వ్యతిరేకంగా నిరసన
Greta Arrest | జర్మనీలో బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా గళం వినిపించిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బెర్గ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టిపెట్టాలని గ్రెట్ డిమాండ్ చేసింది.
Greta Arrest | స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బెర్గ్‌ను జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీలో బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజెప్పేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ చిన్నారి పర్యావరణవేత్తను విడుదల చేశారు.
జర్మీనీలో బొగ్గు గనులను విస్తరించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు జర్మనీలో ఆందోళన చేపట్టారు. యువ పర్యావరణవేత్తగా పేరుగాంచిన 20 ఏండ్ల గ్రెటా థన్‌బెర్గ్ కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకున్నది. దాంతో అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇలా ప్రపంచ దేశాలు బొగ్గు గనులను విస్తరించుకుంటూ పోతే కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమేనా అని గ్రెటా ప్రశ్నిస్తున్నారు. జర్మన్ ప్రభుత్వం మైనింగ్‌ను వెంటనే నిలుపుదల చేసి పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టిసారించాలని ఆమె డిమాండ్ చేశారు.
పశ్చిమ జర్మనీలో ఉన్న బొగ్గు గని గార్జ్వెయిలర్ 2 వద్ద సిట్-ఇన్ నిరసనలో ఇతర నిరసనకారులతో కలిసి గ్రెటా పాల్గొన్నది. ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని వీరు పరిగెత్తేందుకు సిద్ధమవగా పోలీసులు గ్రెటాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆచెన్ నగరాధికారులు తెలిపారు. గ్రెటాతో పాటు ఇతర నిరసనకారులను అధికారికంగా అరెస్ట్ చేయలేదని, వారి గుర్తింపును తనిఖీ చేసిన తర్వాత వారిపై ఎలాంటి నేరారోపణలు చేయకుండా విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

