Greenery | పరిసరాల పచ్చదనం.. ఎముకలకు బలం!
పచ్చదనానికి, ఎముక పటుత్వానికి సంబంధం ఏంటి? పరిసరాల పచ్చదనం అధికంగా ఉన్న చోట నివసించే వారి ఎముకలు బలంగా ఉంటాయా? అంటే అవుననే అంటున్నారు బెల్జియం పరిశోధకులు.
Greenery | హస్సెల్ట్ (బెల్జియం), జనవరి 14: పచ్చదనానికి, ఎముక పటుత్వానికి సంబంధం ఏంటి? పరిసరాల పచ్చదనం అధికంగా ఉన్న చోట నివసించే వారి ఎముకలు బలంగా ఉంటాయా? అంటే అవుననే అంటున్నారు బెల్జియం పరిశోధకులు. ‘వయసుపై పర్యావరణ ప్రభావం’ అనే అంశంపై బెల్జియంలో 4-6 ఏండ్ల వయస్సు కలిగిన 327 మంది పిల్లలపై ఫ్లాండర్స్ రీజియన్లో ఈ పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా వారి ఎముకల పటిష్ఠతను పరిశీలించారు. ఎముకలోని ఖనిజ సాంద్రత కనుగొనడానికి వారు క్వాంటిటేటివ్, అల్ట్రా సోనోగ్రఫీ లాంటి విధానాలను వినియోగించారు.
ఎముకల సాంద్రత పిల్లల వయసు, బరువుతో పెరుగుతుందని… విటమిన్లు తీసుకోవడం, పాలు తాగడం, లింగం, బరువు, స్క్రీన్ టైం, సప్లిమెంట్లు వంటి ఇతర కారకాల ప్రభావం పెద్దగా ఉండదని తెలుసుకున్నారు. 25 శాతం పచ్చదనం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెయ్యి మీటర్ల పరిధిలో నివసించే పిల్లల ఎముకల సాంద్రత తక్కువగా ఉండే అవకాశాలు 66 శాతం తగ్గింది. అంటే పచ్చదనం పిల్లల ఎముకల పటిష్టతపై విశిష్ట ప్రభావం చూపింది. అయితే అధ్యయనంలో పాల్గొన్న వారి లింగ భేదాలను ఇందులో పరిశీలించ లేదు. చిన్నతనంలోనే ఎముకల్లో బలం ఉంటే తర్వాత జీవితంలో మీరు మరింత దృఢంగా మారుతారని పరిశోధనలో పాల్గొన్న హస్సెల్ట్ యూనివర్సితీ ప్రొఫెసర్ టిమ్ నారోట్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

