తైపీ: తైవాన్లో ఓ వింత వెలుగుచూసింది. కాల్పనిక కథల్లోమాదిరిగా ఓ 91 ఏండ్ల వృద్ధురాలి చేతిపై రాక్షస కొమ్ము పెరుగుతున్నది. ఇది 7 సెంటిమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పుతో అతి భయంకరంగా కనిపిస్తున్నది. ఈ అరుదైన సమస్యతో బాధపడుతున్న వృద్ధురాలు ఓ గాజుకడ్డీతో కొమ్మును కవర్చేసి జియుచువాన్ దవాఖానకు వెళ్లింది. ఈ కొమ్మును చూసిన వైద్యుడు మొదట ఉలిక్కిపడ్డాడు. అనంతరం చికిత్స ప్రారంభించాడు. దాన్ని చర్మపుకొమ్ము అని పిలుస్తారని, కెరాటిన్ అనే ప్రొటీన్ వల్ల శంఖు ఆకారంలో గట్టి చర్మం పైకి పొడుచుకురావడంతో ఇది ఏర్పడిందని తెలిపాడు. చికిత్స చేసి ఆ కొమ్మును తొలగిస్తామన్నారు.