కాలిఫోర్నియా: క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. పాస్‌వర్డ్‌లకు బదులు.. పాస్కీ (బయోమెట్రిక్ అథంటికేషన్) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిపై ఈ ఏడాది అక్టోబర్‌లో టెస్టింగ్ పీరియడ్ ప్రారంభించిన గూగుల్, తాజాగా ఈ పాస్‌కీలను క్రోమ్ స్టెబుల్ ‘ఎం108’కు జోడించింది. కంపెనీ సొంత పాస్వర్డ్ మేనేజర్ లేదా 1పాస్వర్డ్, డ్యాష్లేన్ లాంటి అనుకూలమైన థర్డ్‌పార్టీ పాస్వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించి ఈ పాస్‌కీలను ఆండ్రాయిడ్, ఇతర పరికరాలకు వినియోగదారులు వారి పాస్‌కీలను సింక్ చేసుకొనేందుకు గూగుల్ అనుమతి ఇస్తుంది. కంప్యూటర్, ఫోన్ తదితర పరికరాల్లో ఈ పాస్‌కీలను ఉపయోగించొచ్చు.