బంగారు గనిలో పేలుళ్లు.. 59 మంది దుర్మరణం
Burkina Faso | పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో (Burkina Faso) విషాదం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలోని గామ్‌బ్లోరాలో ఉన్న బంగారు గని సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో 59 మంది దుర్మరణం చెందారు.
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో (Burkina Faso) విషాదం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలోని గామ్‌బ్లోరాలో ఉన్న బంగారు గని సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో 59 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పెలుడు సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది.
ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో బుర్కినా ఫాసో ఒకటి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉన్నది. దేశంలోని బంగారు గనుల్లో సుమారు 10.5 లక్షల మంది పనిచేస్తున్నారు. కాగా, గామ్‌బ్లోరాలో దాదాపు 8 వందల ఎకరాల్లో చిన్నచిన్న బంగారు గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి టోగో, బెనైన్, నైగర్, ఘనా దేశాలకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

