Turkey on FATF Grey List : ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి టర్కీ.. పాకిస్థాన్ సరసన చేరిక
ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి టర్కీ | ఎఫ్ఏటీఎఫ్(FATF) అంటే Financial Action Task Force.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకు
ఎఫ్ఏటీఎఫ్(FATF) అంటే Financial Action Task Force.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్సింగ్ చేసే సంస్థలు, దేశాలపై నిఘా పెట్టే సంస్థ. ఈ సంస్థ తాజాగా టర్కీని గ్రే లిస్ట్‌లో పెట్టేసింది. ఇప్పటికే పాకిస్థాన్.. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో అలాగే ఉంచుతూ.. టర్కీని ఆ లిస్ట్‌లో చేర్చుతున్నట్టు ప్రకటించింది.
టర్కీతో పాటు జోర్డాన్, మాలి దేశాలను కూడా గ్రే లిస్ట్‌లో చేర్చుతున్నట్టు ఎఫ్ఏటీఎఫ్ ప్రెసిడెంట్ మార్కస్ ప్లేయర్ వెల్లడించారు.

మనీ లాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినట్టుగా టర్కీపై ఆరోపణలు చేస్తూ ఎఫ్ఏటీఎఫ్.. టర్కీని గ్రే లిస్ట్‌లో చేర్చింది.
జూన్ 2018లో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్ జాబితాలో చేర్చింది. అప్పటి నుంచి పాకిస్థాన్ అదే జాబితాలో కొనసాగుతోంది. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన ప్రణాళికలను అమలు చేయడంలో పాకిస్థాన్ విఫలం అవడం వల్ల అప్పటి నుంచి ఇంకా పాకిస్థాన్ గ్రే లిస్ట్‌లోనే కొనసాగాల్సి వస్తోంది. దీని వల్ల.. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మానెటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ), యురోపియన్ యూనియన్ నుంచి ఆర్థిక సాయం అందదు.
టర్కీకి తగ్గనున్న విదేశీ పెట్టుబడులు
టర్కీని ఎఫ్ఏటీఎఫ్ సంస్థ గ్రే లిస్ట్‌లో పెట్టడం వల్ల.. టర్కీకి విదేశీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా టర్కీకి ఉన్న పలుకుబడి కూడా తగ్గనుంది. మరోవైపు టర్కీ దేశపు సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను ఒకేసారి తగ్గించడంతో టర్కీ కరెన్సీ భారీగా పతనం అయింది. ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే.. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌పై స్పందించిన టర్కీ.. ఇది అన్ ఫెయిర్ అంటూ స్పష్టం చేసింది.

ఇక.. తన చిరకాల మిత్రుడు పాకిస్థాన్‌కు కూడా టర్కీ గ్రే లిస్ట్‌లో చేరడం పెద్ద దెబ్బే అని చెప్పుకొవచ్చు. ఎందుకంటే.. గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్.. బ్లాక్ లిస్ట్‌లో చేరకుండా ఉండేందుకు తెగ ప్రయత్నిస్తోంది. చైనా, టర్కీ, మలేషియా దేశాల సాయంతో ఇప్పటి వరకు బ్లాక్ లిస్ట్ జాబితాలో చేరకుండా తనను తాను కాపాడుకోగలిగింది. కానీ.. ఇప్పుడు టర్కీ కూడా గ్రే లిస్ట్‌లో చేరడంతో పాకిస్థాన్‌కు కూడా ఇది ఒకరకంగా చెంపపెట్టు లాంటిదే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రష్యా గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 16 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. స్కూళ్లు మూత, విమానాలు రద్దు
అలస్కాలో సైనిక విన్యాసాలు.. భీకర శిక్షణలో ఇండియన్ ఆర్మీ
చైనా దాడి చేస్తే.. తైవాన్ను రక్షిస్తాం: బైడెన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

