చైనా దాడి చేస్తే.. తైవాన్ను రక్షిస్తాం: బైడెన్

బాల్టిమోర్: ఒకవేళ తైవాన్‌పై డ్రాగన్ దేశం చైనా దాడి చేస్తే, అప్పుడు తైవాన్‌కు అండగా పోరాడుతామని అమెరికా అధ్యక్షుడ బైడెన్ అన్నారు. తైవాన్ను రక్షిస్తారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవును తాము ఆ విషయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే తైవాన్ అంశంలో తమ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో తమ విధానం ఏమీ మారదని, ఒకవేళ డ్రాగన్ దేశం దాడి చేస్తే, తామే ప్రతిదాడి ఇస్తామని తైవాన్ పేర్కొన్నది.
చాన్నాళ్ల నుంచి తైవాన్ అంశంలో అమెరికా వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది. అయితే తాజాగా బైడెన్ చేసిన కామెంట్ కొంత ఆసక్తిని రేపింది. తైవాన్ తమ దేశానికి చెందిన భూభాగం అని చైనా భావిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని డ్రాగన్ దేశం ఆలోచిస్తున్నది. కానీ తైవాన్ మాత్రం తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. తైవాన్‌తో అమెరికాకు నేరుగా దౌత్యపరమైన సంబంధాలు లేవు. కానీ ఆ దేశానికి ఆయుధాలను అమెరికా అమ్ముతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

