జెరూసలెం: హమాస్‌తో యుద్ధంలో భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ జవాన్ గిల్ డేనియల్స్ అమరుడయ్యారు. ఆష్డోడ్లో నివసిస్తున్న ఆయన మంగళవారం గాజాలో మరణించారని, ఆయన స్వస్థలంలోని మిలిటరీ శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలు జరిగాయని కమ్యూనిటీ మెంబర్స్ తెలిపారు. ఆయన మహారాష్ట్రలో జన్మించారని, మకిఫ్ గిమెల్ హైస్కూల్లో 2007లో చదివారని చెప్పారు.
ఆయన అక్టోబరు 10న సైన్యంలోకి వెళ్లారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లో హమాస్ ఉగ్రవాదులతో జరిగిన యుద్ధంలో మంగళవారం ఇద్దరు అమరులయ్యారని, వారిలో గిల్ ఒకరని తెలిపింది.