హిందూ ద్వేషానికి వ్యతిరేకంగా జార్జియా తీర్మానం
హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
జార్జియా, ఏప్రిల్ 1: హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. హిందువులకు మద్దతుగా యూఎస్‌లో ఒక రాష్ట్ర శాసనసభ ఇలా తీర్మానం చేయడం ఇదే ప్రథమం. జార్జియాలో భారత అమెరికన్లు అధికంగా నివసించే అట్లాంటా సబర్బ్‌లోని ఫోర్సిత్కు చెందిన ప్రజాప్రతినిధులు లారెన్, మెక్‌డోనాల్డ్, టాడ్ జాన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో 120 కోట్ల మంది హిందూ ధర్మాన్ని, సిద్ధాంతాలను ఆచరిస్తున్నారని, శాంతి, సామరస్యం, పరుల పట్ల గౌరవం, నైతిక విలువలు వంటి విశ్వాసాలను ఆచరించే వీరిపై కొందరు ద్వేషంతో ప్రవర్తించడాన్ని జార్జియా అసెంబ్లీ ఖండించింది.
కొన్ని దశాబ్దాలుగా హిందువుల పట్ల విద్వేష భావంతో దాడులు జరిగినట్టు గత సంఘటలు వెల్లడిస్తున్నాయని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. వైద్యం, సైన్స్, ఇంజినీరింగ్, ఐటీ, ఆతిథ్యం, ఆర్థికం, అకాడమీ, తయారీ, ఎనర్జీ, రిటైల్ ట్రేడ్లతో పాటు పలు రంగాలలో ఇండో అమెరికన్ల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేద, మెడిటేషన్, మ్యూజిక్, కళలను అమెరికాకు తీసుకువచ్చి అమెరికన్లను నూతన పంథాలో నడిపించడమే కాక, వాటిని అనుసరించేలా చేసి లక్షల మంది ఆయుష్షు పెంచేందుకు దోహదపడుతున్నారని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

