జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్
విద్యార్థి ఉద్యమానికి మరో ప్రభుత్వం కుప్పకూలింది. సెర్బియాలో జరిగిన తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో సంచలన రాజకీయ మార్పు చోటుచేసుకుంది.
- సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
- వీధుల్లో యువత సంబురాలు
బెల్గ్రేడ్: విద్యార్థి ఉద్యమానికి మరో ప్రభుత్వం కుప్పకూలింది. సెర్బియాలో జరిగిన తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో సంచలన రాజకీయ మార్పు చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు, రైట్ వింగ్ నేత అలెగ్జాండర్ వూసిచ్ తన ఓటమిని అంగీకరించడంతో, విద్యార్థి నాయకత్వంలోని ‘స్టూడెంట్ లిస్ట్’ ఉద్యమం విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజధాని బెల్గ్రేడ్తో పాటు పలు నగరాల్లో వేలాది యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఘనంగా సంబురాలు చేసుకున్నారు.
కార్లపై తిరుగుతూ, గట్టిగా హారన్లు కొడుతూ, పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో స్టూడెంట్ లిస్ట్ సుమారు 2.2 మిలియన్ల ఓట్లను(52శాతం ఓటు షేరింగ్) సాధించి, పార్లమెంట్లో 135 నుంచి 140 సీట్లను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలెగ్జాండర్ వూసిచ్కు చెందిన సెర్బియన్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎస్ఎన్ఎస్) సుమారు 1.7 మిలియన్ల ఓట్లను(32.3 శాతం) మాత్రమే సాధించి, దాదాపు 105 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం వూసిచ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలను నమ్ముకుని, తాము ఓడిపోయామని బహిరంగంగా అంగీకరించారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన స్టూడెంట్ లిస్ట్‌కు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా అభినందనలు తెలిపారు. మరోవైపు సంబురాల సమయంలో సెంట్రల్ బెల్గ్రేడ్లోని వూసిచ్ అనుచరులు గతంలో ఏర్పాటు చేసిన టెంట్లు, ఫెన్సింగ్‌లను ఆందోళనకారులు తొలగించి నిరసన తెలిపారు. కొన్నిచోట్ల యువకులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏదేమైనా అవినీతికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్టూడెంట్ లిస్ట్ సాధించిన ఈ విజయం సెర్బియా రాజకీయాల్లో మైలురాయిగా నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

