Airport Transit Visa | ఇండియన్ ప్యాసింజర్స్‌కు ఫ్రాన్స్ గుడ్ న్యూస్.. అదేమిటంటే..!
Airport Transit Visa | భారత ప్రయాణికుల (Indian passengers) కు ఫ్రాన్స్ ప్రభుత్వం (France Govt) శుభవార్త చెప్పింది. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇక నుంచి ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా (Airport Transit Visa) అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం (France Embassy) ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
Airport Transit Visa : భారత ప్రయాణికుల (Indian passengers) కు ఫ్రాన్స్ ప్రభుత్వం (France Govt) శుభవార్త చెప్పింది. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇక నుంచి ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా (Airport Transit Visa) అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం (France Embassy) ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
కొత్త నిబంధన ప్రకారం.. సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి, అక్కడి నుంచి మూడో దేశానికి వెళ్లేటప్పుడు ట్రాన్సిట్ వీసా మినహాయింపు వర్తిస్తుంది. అయితే ప్రయాణికులు విమానాశ్రయంలోని అంతర్జాతీయ జోన్ దాటి బయటకు రాకూడదు. కేవలం లేఓవర్ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వారికి మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా.. భారతీయులకు ప్రయాణ నిబంధనలు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీకి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 9న ఫ్రాన్స్ అధికారిక గెజిట్‌లో ఇందుకు సంబంధించిన సవరణ ఉత్తర్వులను ప్రచురించారు. ఈ మార్పులకు అనుగుణంగా అధికారిక ఫ్రాన్స్-వీసాస్ ప్లాట్ఫామ్లో సమాచారాన్ని కూడా అప్డేట్ చేసినట్టు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నిర్ణయంతో ఫ్రాన్స్ మీదుగా యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే వేలాది మంది భారతీయులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

