పారిస్: కరోనా వైరస్ ఫ్రాన్స్‌ను (France) వణికిస్తున్నది. దేశంలో 24 గంటల వ్యవధిలో 1,79,807 మంది కరోనా బారినపడ్డారు. మహమ్మారి ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని జాతీయ ప్రజారోగ్య సంస్థ ప్రకటించింది. భారీ సంఖలో కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈనెల చివరినాటికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఒలివర్ వెరాన్ చెప్పారు. కాగా, దేశంలో ఇప్పటికే 77 శాతం మంది కరోనా వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో తీసుకున్నారు.
ఇక మరో యూరోపియన్ దేశమైన యూకేలో మంగళవారం 1,29,471 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో కూడా 78,300 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంది సోమవారం నాటికంటే రెండితలు ఎక్కువ కావడం విశేషం.