Radiation effect | పరిమితికి మించి రేడియేషన్ విడుదల చేస్తున్న ఐఫోన్ 12.. ఫ్రాన్స్‌లో యాపిల్ ఫోన్ల విక్రయాలు బంద్
ఐఫోన్ 12 పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తున్నదని, ఆ మాడల్ అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్ఎఫ్ఆర్) యాపిల్ కంపెనీని ఆదేశించింది. ఇటీవల 141 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో ఐఫోన్ 12 అధిక స్మార్ట్‌ఫోన్స్ స్పెసిఫిక్ అబ్జార్ప్సన్ రేట్ (ఏఎస్ఆర్)ను కలిగి ఉందని గుర్తించినట్టు రేడియేషన్ ప్రీక్వెన్సీని పర్యవేక్షించే ఈ సంస్థ వెల్లడించింది.
పారిస్, సెప్టెంబర్ 13: ఐఫోన్ 12 పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తున్నదని, ఆ మాడల్ అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్ఎఫ్ఆర్) యాపిల్ కంపెనీని ఆదేశించింది. ఇటీవల 141 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో ఐఫోన్ 12 అధిక స్మార్ట్‌ఫోన్స్ స్పెసిఫిక్ అబ్జార్ప్సన్ రేట్ (ఏఎస్ఆర్)ను కలిగి ఉందని గుర్తించినట్టు రేడియేషన్ ప్రీక్వెన్సీని పర్యవేక్షించే ఈ సంస్థ వెల్లడించింది.
ఆ ఫోన్లలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అబ్జార్ప్సన్ కిలోగ్రాముకు 5.74 వాట్ ఉందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్ కిలోగ్రాముకు 4 వాట్ కంటే ఇది చాలా అధికమని ఏఎన్ఎఫ్ఆర్ పేర్కొంది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఫోన్లలో ఈ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని యాపిల్ కంపెనీని ఆదేశించింది. లేదంటే వాటిని కూడా రీకాల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను యాపిల్ కంపెనీ ఖండించింది. తమ ఉత్పత్తి ప్రపంచ దేశాల ప్రమాణాల ప్రకారమే ఉందని తెలిపింది. వివిధ దేశాలు, ప్రైవేటు ల్యాబ్‌ల ప్రమాణాలను అందుకున్నట్టు చూపించే నివేదికలను ఏఎన్ఎఫ్ఆర్కు సమర్పించామని పేర్కొంది. ఈ విషయం గురించి ఏఎన్ఎఫ్ఆర్తో చర్చిస్తున్నామని యాపిల్ కంపెనీ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

