US Shooting | చర్చిలో కాల్పులు జరిపి నిప్పుపెట్టాడు.. నలుగురు మృతి
అమెరికాలో కాల్పులు కలకలం (US Shooting) సృష్టించాయి. మిషిగన్‌లోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు.
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం (US Shooting) సృష్టించాయి. మిషిగన్‌లోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఆదివారం మిషిగన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్‌లోని మోర్మాన్ చర్చిని కారుతో ఢీకొట్టిన దుండగుడు, కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం నిప్పుపెట్టాడు. చర్చి మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఎనమిది మంది గాయపడ్డారని, నిందితుడు హతమయ్యాడని పోలీసులు చెప్పారు.
నిందితుడిని థామస్ జాకబ్ స్యాన్‌ఫోర్డ్ (40)గా గుర్తించామని, అతడు గతంలో యూఎస్ మెరైన్‌లో పనిచేశాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై పోలీసులు స్పష్టత నివ్వడం లేదు. కాగా, ఈ ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దేశంలోని క్రిస్టియాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు వెంటనే ఆగిపోవాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

