వాషింగ్టన్, అక్టోబర్ 20: పసిఫిక్ సముద్రంపై కొంత ఎత్తులో గుర్తుతెలియని ఎరిగే వస్తువులు (అన్ఐడింటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్-యూఎఫ్ఓ) తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ఆ సముద్రం మీదుగా విమానాలను నడిపే పలువురు పైలెట్లు వెల్లడించారు.
గత రెండు నెలలుగా ఇది జరుగుతున్నదని వీడియో ఫుటేజీ, విమానాల పైలట్లకు సంబంధించి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్‌లు సంపాదించిన ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్, డిస్కవరీ+ షో హోస్ట్ బెన్ హెన్సేన్ పేర్కొన్నారు. పసిఫిక్ రీజియన్‌లో తన కంటే పై ఎత్తులో ఎగురుతున్న పలు వస్తువులను గుర్తించినట్టు ఓ పైలట్ పేర్కొన్నారు. అయితే ఆ ఎగిరే వస్తువులు ఏమిటనేవి స్పష్టత రాలేదు.