Benedict | క్యాథలిక్ మతాధిపతి, మాజీ పోప్ బెనెడిక్ట్ (95) పరమపదించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బెన్డిక్ట్.. హృద్రోగ, ఇతర వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం ఉదయం 9: 34గంటల సమయంలో ప్రాణాలు వదిలినట్లు వాటికన్ ప్రతినిధులు వెల్లడించారు.
క్యాథలిక్ మతాధిపతిగా వ్యవహరించిన బెనెడిక్ట్ XVI 2013లో వృద్ధాప్య కారణాలతో పోప్ పదవికి రాజీనామా చేసి కేథలిక్ క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల పోప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో బెనెడిక్ట్ ప్రకటించాడు. దాదాపు 600 ఏండ్లలో పోప్ పదవి నుంచి ఇలా అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి. ఈయన కంటే ముందు 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా గ్రెగొరీ XII రాజీనామా చేశాడు.