Kevin Rudd | అమెరికా రాయబారిగా ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రుడ్ నియామకం
వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికా అంబాసిడర్‌గా కెవిన్ బాధ్యతలు
Kevin Rudd : ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి కెవిన్ రుడ్ అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఆంథోని అల్బనెసె మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కెవిన్‌కు నాయకుడిగా, విదేశాగం శాఖ మంత్రిగా పని చేసిన అనుభం ఉంది. చైనా- అమెరికా సంబంధాలపై విస్తృతుంగా అధ్యయనం చేసిన ఆయన గతంలో అమెరికాలో కొన్నాళ్లు పనిచేశారు. ఈ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడు’ అని అంథోని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కెవిన్ అమెరికా అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
కెవిన్ రెండుసార్లు ఆస్ట్రేలియా ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. మొదటి దఫా 2007 నుంచి 2010 వరకు పదవిలో కొనసాగారు. రెండో దఫాలో మాత్రం మూడు నెలలు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలోని లేబర్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైంది. 2013 జూన్‌లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆయన సెప్టెంబర్‌లో పదవి నుంచి తప్పుకున్నారు. కెవిన్ 2010-12 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా సేవలందించారు. ‘భద్రతాపరంగా అమెరికా, ఆస్ట్రేలియాకు కీలకమైన భాగస్వామి’ ఆని ఈ సందర్బంగా కెవిన్ వెల్లడించారు. తమదేశం గత దశబ్దాలుగా భద్రతా, దౌత్యపరమైన సంబంధాల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నదని కెవిన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

