కోర్టులో తొలిసారి వాదించనున్న రోబో లాయర్.. ఎక్కడంటే!
కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఈ రోబో లాయర్ ఫిబ్రవరి నెలలో కోర్టులో తొలిసారి వాదించనున్నట్లు తెలిపింది. అయితే ఏ కోర్టులో ఎవరిపై వాదిస్తుంది అన్న వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.
వాషింగ్టన్: రోబో లాయర్ తొలిసారి కోర్టులో వాదించనున్నది. నమ్మసక్యం కాని ఇది త్వరలో వాస్తవం కానున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతో రూపొందించిన రోబో న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించనున్నది. దీని ద్వారా కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ వెల్లడించింది. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఈ రోబో లాయర్ ఫిబ్రవరి నెలలో కోర్టులో తొలిసారి వాదించనున్నట్లు తెలిపింది. అయితే ఏ కోర్టులో ఎవరిపై వాదిస్తుంది అన్న వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.
కాగా, ఈ రోబో న్యాయవాది స్మార్ట్‌ఫోన్ సహకారంతో పని చేస్తుందని న్యూ సైంటిస్ట్ పేర్కొంది. కోర్టులో వాదనలు విన్న తర్వాత ఏం వాదించాలో అన్నది ఇయర్ ఫోన్ ద్వారా ప్రతివాదికి సూచిస్తుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాషువా బ్రౌడర్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ 2015లో కాలిఫోర్నియాలో ‘డునాట్‌పే’ సంస్థను స్థాపించారు. తాము రూపొందించిన ‘డునాట్‌పే’ యాప్ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్ అని ఆయన తెలిపారు. ఈ రోబో న్యాయవాది పని తీరుకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఈ యాప్‌లోని ఒక బటన్ నొక్కడం ద్వారా కార్పొరేషన్లతో పోరాటం చేయడంతోపాటు బ్యూరోక్రసీని ఓడించవచ్చని, ఎవరిపైన అయినా దావా వేయవచ్చని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జాషువా బ్రౌడర్ తెలిపారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వాస్తవాలను తారుమారు చేయడం మంచిది కాదన్న ఆయన, తమ యాప్ ద్వారా అలాంటి వాటిని నివారించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
Here it is! The first ever Comcast bill negotiated 100% with A.I and LLMs.
Our @DoNotPay ChatGPT bot talks to Comcast Chat to save one of our engineers $120 a year on their Internet bill.
Will be publicly available soon and work on online forms, chat and email. pic.twitter.com/eehdQ5OXrl
— Joshua Browder (@Joshuabrowder) December 12, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

