జిలేబీ లేదా జలేబీ.. పేరు ఏదైనా దాన్ని చూస్తేనే నోరూరుతుంది. వెంటనే నోట్లేసుకోవాలనిపిస్తుంది. అది జిలేబీకి ఉన్న మహిమ. ఒక్క జిలేబీ తింటే చాలు.. నోరంతా తీపి అవుతుంది. జిలేబీ గురించి తెలిసిన వాళ్లు దాని టేస్ట్ ఎలా ఉంటుందో చెబుతారు. కానీ.. మొదటి సారి జిలేబీని తింటే అప్పుడు ఏంటి పరిస్థితి.
దాని టేస్ట్‌ను ఎలా ఆస్వాదిస్తారు. ఇదిగో.. వియత్నాంకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ తొలిసారి జిలేబీ తిన్నది.. ఆ తర్వాత తన రియాక్షన్ చూస్తే అవాక్కవుతారు. కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్లో తను జిలేబీని తిన్నది. జిలేబీ బాగుంది. సిరప్ టేస్ట్‌లా ఉంది. ఇది ఇండియా నేషనల్ స్వీట్ అని తెలుసు. సాఫ్రాన్ సిరప్‌లో ఫన్నెల్ కేక్‌ను ముంచుకొని తిన్నట్టుగా ఉంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? అంటూ క్యాప్షన్ పెట్టి వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.