అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ 36 స్ట్రీట్ సబ్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురు తమ ప్రాణాలను కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇక ఈ ఘటన తర్వాత సబ్ వేలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయని, ఈ కారణంగా రైళ్ల రాకపోకలను కూడా నిలిపేశామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే భవన నిర్మాణ కార్మికుడి రూపంలో కాల్పులు చేసిన దుండగుడు ఈ సబ్‌వేలోకి వచ్చారని, గ్యాస్ మాస్క్ కూడా ధరించాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరోవైపు తాము సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలింపును ప్రారంభించామని పోలీసులు తెలిపారు.