Fire accident | మంటల్లో ఫెర్రీస్ వీల్.. మ్యూజిక్ ఫెస్టివల్లో విషాదం..!
Fire accident | అక్కడంతా సందడి సందడిగా ఉంది. సందర్శకుల కేరింతల నడుమ ఘనంగా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ భయానక ఘటన చోటుచేసుకుంది. ఆ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire accident : అక్కడంతా సందడి సందడిగా ఉంది. సందర్శకుల కేరింతల నడుమ ఘనంగా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ భయానక ఘటన చోటుచేసుకుంది. ఆ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఫెర్రీస్ వీల్లో ఉన్న సందర్శకులు హాహాకారాలు పెట్టారు. జర్మనీలో జరిగిన ఈ ఘటనలో మొత్తం 30 మందికి కాలిన గాయాలయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జర్మనీలోని లైప్‌సిగ్ నగరంలో స్టార్మ్థాలర్ సరస్సు ఒడ్డున నిర్వహించిన సమ్మర్ ఫెస్టివల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫెర్రీస్ వీల్ తిరుగుతున్న సమయంలో ముందుగా ఓ టబ్‌కు మంటలు అంటుకున్నాయి. అది గాల్లో తిరుగుతుండగానే ఇతర టబ్‌లకు మంటలు వ్యాపించాయి. దాంతో తిరుగుతున్న సర్కిల్లో దట్టమైన పొగ కమ్మింది.
ఈ అనూహ్య పరిణామంతో వీల్లో సందర్శకులతోపాటు కింద ఉన్న వేలాది మంది సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు జాయింట్ వీల్ తిరగకుండా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. అప్పటికే దట్టమైన పొగ అలుముకోవడంతో నలుగురు పోలీస్ అధికారులతోపాటు మొత్తం 30 మంది అస్వస్థతకు గురయ్యారు.
వారిలో ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగానే వీల్లో మంటలు చెలరేగాయని నిర్వాహకులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

