Blast in USA | అమెరికాలో పేలుడు.. దేశంలోనే అతిపెద్ద డ్యామ్ వద్ద ఘటన!
Blast in USA | అమెరికాలోని నెవడా రాష్ట్ర పరిధిలోని హూవర్ డ్యామ్ వద్ద మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది.
Blast in USA | అమెరికాలోని నెవడాలో పేలుడు సంభవించింది. దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌గా పేరొందిన హూవర్ డ్యామ్ వద్ద మంగళవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి చెందిన స్థలం కావడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడికి వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురయ్యారు.
నెవడా మాన్యుమెంట్ వద్ద జెయింట్ ఫైర్ బాల్ రైజింగ్ దృశ్యాల వీడియోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేలుడు ఘటనను బౌల్డర్ సిటీ పోలీసు అధికారులు ధృవీకరించారు.
హూవర్ డ్యామ్ వద్ద పేలుడు సంభవించడంతో దట్టమైన పొగ మేఘాలను తలపించేలా వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియోనను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏమైనా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగిందా అన్న సంగతి తెలియరాలేదు. ఈ పేలుడుకు కారణాలు కూడా తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

