శాన్ఫ్రాన్సిస్కో, మే 13: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ యూట్యూబర్కు 20 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ అక్కడి ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. యూట్యూబ్లో వ్యూస్ సాధించి తద్వారా డబ్బు సంపాదించాలనే కారణంతో విమానాన్ని కూల్చినట్టు తనపై వచ్చిన అభియోగాన్ని అతను అంగీకరించడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ట్రెవర్ డేనియల్ జాకబ్(29) 2021 నవంబర్లో ఓ విమానాన్ని నడిపాడు.
గమ్యానికి చేరకముందే పారాచూట్ సాయంతో కిందికి దూకుతూ విమానం పడిపోతున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించాడు. విమానానికి అమర్చిన కెమెరాల్లో ఉన్న వీడియోలను తీసుకున్నాడు. ఈ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అనంతరం విమాన శకలాలను మాయం చేసి విచారణాధికారులను తప్పుదోవ పట్టించాడు. ఈ ఆరోపణలను అతను అంగీకరించడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది.