క్రూరంగా చంపుతాం.. కాళ్లు, చేతులు నరికేస్తాం

కాబూల్: తాలిబన్లు అంటేనే క్రూరత్వం గుర్తుకువస్తుంది. అయితే అలాంటి రోజులు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్‌లో కనిపించనున్నాయి. ఇటీవల ఆ దేశాన్ని మళ్లీ హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా ఓ ప్రకటన చేశారు. మతపరమైన శిక్షలు ఉంటాయని ఆ వర్గానికి చెందిన ఓ నేత తెలిపారు. అతి కిరాతకంగా చంపివేయడం, కాళ్లు, చేతుల్ని నరికివేయడం లాంటి శిక్షలను మళ్లీ అమలు చేయనున్నట్లు ప్రిజన్స్ ఇంచార్జీ నేత ముల్లా నూరుద్దిన్ తురాబి తెలిపారు. అయితే అలాంటి శిక్షలను ఈసారి పబ్లిక్‌గా అమలు చేయబోమన్నారు. 1990 దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఏలిన రోజుల్లో ఇలాంటి శిక్షలనే అమలు చేసేవారు.
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తిరిగి చేజిక్కించుకున్న తాలిబన్లు మెల్లమెల్లగా తమ స్టయిల్ పాలనను అమలులోకి తీసుకువస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. హీరత్ నగరంలో హై ప్రొఫైల్ మహిళలను తాలిబన్లు అడ్డుకుంటున్నారు. ఇంటి బయట తిరగకుండా.. డ్రెస్సు కోడ్‌పై ఆంక్షలు విధిస్తున్నారు. హజారాలోని మైనార్టీపై అఘాయిత్యానికి పాల్పడిన 9 మందిని చంపిన ఘటనలో తాలిబన్లపై ఆమ్నెస్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా శిక్షలు వేసే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఓ తాలిబన్ నేత ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

